BCCI Test Match Fee Hike: భారత ఆటగాళ్లకు బంఫరాఫర్‌.. ఇకపై ఏకంగా రూ.20 లక్షలు!

BCCI to hike Test match fees? Decision soon with players opting to focus on IPL: Report - Sakshi

టీమిండియాలోకి తిరిగి రావాలంటే కచ్చితంగా రంజీల్లో ఆడాలన్న బోర్డు ఆదేశాలను ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు ధిక్కరించిన సంగతి తెలిసిందే. బీసీసీఐ ఆదేశాలను భేఖాతర్ చేసి వీరిద్దరూ రంజీల్లో ఆడకుండా తప్పించుకున్నారు. అయ్యర్‌ వెన్ను గాయం సాకు చెప్పి ఏన్సీఏలోనే ఉండిపోగా.. కిషన్‌ అయితే ఏకంగా రంజీల్లో ఆడకుండా, ఐపీఎల్ కోసం ప్రాక్టీస్‌ చేసుకుంటున్నాడు. వీరిద్దరూ వ్యవహరంపై బీసీసీఐ పెద్దలు సీరియస్‌గా ఉన్నట్లు వినికిడి.

కీలక నిర్ణయం దిశగా బీసీసీఐ..
అయితే రెడ్‌ బాల్‌ క్రికెట్‌పై ఆటగాళ్లకు ఆసక్తి పెంచేందుకు కీలక నిర్ణయం దిశగా బీసీసీఐ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆటగాళ్ల టెస్ట్ మ్యాచ్ ఫీజులను పెంచే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు ఇండియన్స్‌ ఎక్స్‌ ప్రెస్‌ తమ కథనంలో పేర్కొంది.

"ఏ ఆటగాడైనా క్యాలెండర్‌ ఈయర్‌లో మొత్తం అన్ని సిరీస్‌లలోనూ భాగమమైతే.. అతడికి వార్షిక కాంట్రాక్ట్‌ రిటైన్‌తో పాటు అదనంగా రివార్డ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మ్యాచ్‌ ఫీజులు కూడే పెరిగే ఛాన్స్‌ ఉంది. ఈ నిర్ణయంతో టెస్ట్ క్రికెట్‌ ఆడేందుకు ఆటగాళ్లు ఆసక్తి చూపుతారని భావిస్తున్నామని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.

కాగా బీసీసీఐ ప్రస్తుతం  ఒక్కో టెస్టుకు మ్యాచ్ ఫీజుగా రూ.15 లక్షలు, వన్డేకు 6 లక్షలు, టీ20 మ్యాచ్‌లకు 3 లక్షలు చెల్లిస్తోంది. అయితే ఇప్పుడు టెస్టు మ్యాచ్ ఏకంగా రూ.20 లక్షలకు పెంచే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అయితే కొత్త రెమ్యునరేషన్ మోడల్ ఐపీఎల్‌-2024 సీజన్‌ తర్వాత అమలులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది.
చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌..12 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌ బై!

whatsapp channel

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top