IND VS WI: ఇద్దరు మంచి ఆటగాళ్లే..  ఆ స్థానంలో నా ఫేవరెట్‌ మాత్రం అతడే

Ajit Agarkar Picks Favourite Player Between SuryaKumar Yadav-Shreyas Iyer - Sakshi

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ మిడిలార్డర్‌లో సూపర్‌ హిట్టయిన సంగతి తెలిసిందే. మూడు వన్డేలు కలిపి 104 పరుగులు సాధించాడు. ఇందులో ఒక అర్థసెంచరీ ఉంది. ఇక సిరీస్‌కు ముందు కరోనా బారిన పడిన శ్రేయాస్‌ అయ్యర్‌ మూడో వన్డేలో రీఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. 80 పరుగులతో రాణించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ ఇద్దరిలో ఎవరు ఫేవరెట్‌ ప్లేయర్‌ అని టీమిండియా మాజీ ఆటగాడు, కామెంటేటర్‌ అజిత్‌ అగార్కర్‌ను ప్రశ్నించగా.. ఆసక్తికర సమాధానమిచ్చాడు.

ఇద్దరు మంచి ఆటగాళ్లు. మంచి స్ట్రైక్‌తో పరుగులు రాబట్టగల నైపుణ్యం ఉంది. అయితే సూర్యకుమార్‌ యాదవ్‌ విషయంలో నాకు పాజిటివిటి ఎక్కువగా ఉంది. అతను ఇప్పుడు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో 5-6 స్థానాల్లో ఎక్కువగా  వస్తున్నాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసే ఆల్‌రౌండ్‌ నైపుణ్యం అతనిలో​ కనిపిస్తుంది. అలా అని శ్రేయాస్‌ను తక్కువ అంచనా వేయకూడదు. మంచి స్ట్రైక్‌రేట్‌తో పరుగులు రాబట్టే సామర్ధ్యం అతనిలో పుష్కలంగా ఉంది.

ఇద్దరిలో ఒకరిని ఫేవరెట్‌గా ఎంచుకోమంటే.. నేను సూర్యకుమార్‌ యాదవ్‌వైపే మొగ్గుచూపుతా. ప్రస్తుత ఫామ్‌ దృష్యా మాత్రమే ఇది పరిగణనలోకి తీసుకున్నా. మిడిలార్డర్‌లో కీలకంగా పరిగణించే ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం సూర్యకుమార్‌ను నా ఫేవరెట్‌ను చేసింది అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఇటీవలే జరిగిన ఐపీఎల్‌ మెగా వేలంలో శ్రేయాస్‌ అయ్యర్‌ను కేకేఆర్‌ రూ. 12.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక ఈ సీజన్‌లో కేకేఆర్‌ తరపున శ్రేయాస్‌ అయ్యర్‌ కెప్టెన్‌ అయ్యే అవకాశం ఉంది. ఇక ముంబై ఇండియన్స్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను రిటైన్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. 

చదవండి: IPL 2022 Auction- Ind Vs Wi: 10 కోట్లు పలికాడు .. హోటల్‌లో పిజ్జా పార్టీ.. పాపం కరెంట్‌ షాక్‌ కొట్టింది!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top