IND vs WI: 'దూకుడుగా ఆడుతాడని ఓపెనర్‌గా ఛాన్స్‌ .. అయితే'

Aakash Chopra on Ishan Kishans poor strike rate against West Indies - Sakshi

వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా ఆటగాడు ఇషన్‌ కిషన్‌ మూడు ఇన్నింగ్సుల్లో వరుసగా 35, 2, 34 పరగులు సాధించాడు. అయితే ఈ సిరీస్‌లో కిషన్‌ స్ట్రైక్‌ రేట్‌ 100 లోపే ఉండడం గమనార్హం. మొత్తం మూడు మ్యాచ్‌ల్లో 83 బంతులు ఎదుర్కున్న కిషన్‌ స్ట్రైక్‌ రేట్‌ 85.5గా ఉంది. కాగా దూకుడుగా ఆడే కిషన్‌కు తగ్గట్టు స్ట్రైక్‌ రేట్‌ ఇది కాదని మాజీ క్రికెటర్‌లు అభిప్రాయపడుతున్నారు.ఈ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాష్‌ చోప్రా కూడా చేరాడు. కిషన్‌ దూకుడుగా ఆడుతాడని ఓపెనర్‌గా బాధ్యతలు అప్పగించారని చోప్రా అభిప్రాయపడ్డాడు. అయితే దానికి భిన్నంగా కిషన్‌ ఆట తీరు కనిపించిందని అతడు తెలిపాడు. "ఇషాన్ కిషన్ మళ్లీ ఒత్తిడికి గురైయ్యాడు.

అతడు ఈ సిరీస్‌లో బాగా బ్యాటింగ్‌ చేసాడు. కానీ అతడి స్ట్రైక్ రేట్ ఇంకా నాకు సందేహాస్పదంగా ఉంది. ఈ సిరీస్‌లో అతడు తన దూకుడుకు తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయాడు. అతడు ఓపెనర్‌గా వస్తే ఒత్తిడికి లోను అవుతున్నాడు. ఇక రుత్‌రాజ్‌ గైక్వాడ్‌కు అఖరి మ్యాచ్‌లో మంచి అవకాశం లభించింది. అతడు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోలేకపోయాడు. కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో సూర్యకూమార్‌ యాదవ్‌, వెంకటేశ్‌ అయ్యర్ అద్భుతంగా రాణించారు. వీరిద్దరూ కలిసి టీమిండియాకు భారీ స్కోర్‌ను అందించారు" అని ఆకాష్‌ చోప్రా పేర్కొన్నాడు.

చదవండి: T20 WC 2022: హార్దిక్‌ పాండ్యా కంటే ముందు వరుసలో... ప్రపంచకప్‌ జట్టులో అతడికి చోటు ఖాయం!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top