నిబంధనలు పాటించకపోతే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు పాటించకపోతే చర్యలు

May 24 2026 11:28 AM | Updated on May 24 2026 11:28 AM

ట్రాఫిక్‌ సీఐ సత్యనారాయణ

గజ్వేల్‌రూరల్‌: వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని ట్రాఫిక్‌ సీఐ సత్యనారాయణ హెచ్చరించారు. శనివారం ఆయన మాట్లాడుతూ గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన చౌరస్తాల వద్ద ఇటీవల నిర్వహించిన డ్రంకెన్‌డైవ్‌లో 19 మంది పట్టుపడ్డారన్నారు. వారిని న్యాయమూర్తి స్వాతిగౌడ్‌ ఎదుట హాజరుపర్చగా విచారణ అనంతరం రూ.1.13 లక్షల జరిమానా విధించారని చెప్పారు. వారిలో కొందరికి జైలు శిక్ష విధించారని, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపిన తొమ్మిది మందికి రూ.45 వేల జరిమానా విధించినట్లు తెలిపారు.

కొనుగోళ్లు సజావుగా సాగేలా చూస్తాం

గజ్వేల్‌: గజ్వేల్‌ మార్కెట్‌ యార్డు పరిధిలోని గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌ మండలాల్లో వరి, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూస్తామని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వంటేరు నరేందర్‌రెడ్డి చెప్పారు. శనివారం ఆయన మాట్లాడుతూ 22 వరకు 74,554 క్వింటాళ్ల వడ్లు, 26,090 క్వింటాళ్ల మొక్కజొన్న, మరో 3,654 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు కొనుగోళ్లు జరిగాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement