● ఐదేళ్లుగా.. అసంపూర్తిగా | - | Sakshi
Sakshi News home page

● ఐదేళ్లుగా.. అసంపూర్తిగా

May 24 2026 11:28 AM | Updated on May 24 2026 11:28 AM

కిష్టాపూర్‌లో అసంపూర్తిగా

నిలిచిన ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణం

పేదకుటుంబాల వారు వివాహ, శుభకార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు ఉపయోగపడే విధంగా గ్రామాల్లో విలేజ్‌ ఫంక్షన్‌ హాళ్ల నిర్మాణానికి గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చిన్నకోడూరు మండలం కిష్టాపూర్‌లో రూ.30 లక్షలతో ఐదేళ్ల క్రితం ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణ పనులు చేపట్టారు. నిధులు చాలక నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో ఆ నిర్మాణం అసంపూర్తిగా దర్శనమిస్తోంది. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. త్వరగా నిర్మాణం పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. – చిన్నకోడూరు(సిద్దిపేట)

Advertisement
 
Advertisement
Advertisement