అట్రాసీటీ కేసుపై విచారణ | - | Sakshi
Sakshi News home page

అట్రాసీటీ కేసుపై విచారణ

May 24 2026 11:28 AM | Updated on May 24 2026 11:28 AM

మద్దూరు(ముస్నాబాద్‌): దూల్మిట్ట మండలంలోని జాలపల్లి గ్రామానికి చెందిన నాగులపల్లి సంపత్‌ అదే గ్రామానికి చెందిన మెతుకు పాపిరెడ్డి, మెతుకు భాస్కర్‌రెడ్డిపై ఫిర్యాదు చేయగా మద్దూరు పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. దీంతో శనివారం హుస్నాబాద్‌ ఏసీపీ సదానందం గ్రామాన్ని సందర్శించి సాక్షులను విచారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపిరెడ్డి, భాస్కర్‌రెడ్డి కులం పేరుతో తనను ధూషించారని గత 20న సంపత్‌ ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. విచారణలో తేలిన అంశాల ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట మద్దూరు ఎస్‌ఐ ఆసిఫ్‌ ఉన్నారు.

మంటల్లో తుంగచెట్లు

హుస్నాబాద్‌: సిద్దిపేట రోడ్‌లోని పెట్రోల్‌ బంక్‌ వెనుక ఉన్న తుంగచెట్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడటంతో పెట్రోల్‌ కోసం వచ్చిన వినియోగదారులు భయంతో పరుగులు పెట్టారు. సమీపంలోని ఇళ్లలోకి పొగ వ్యాప్తి చెందడంతో ఆందోళనకు గురయ్యారు. ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. గతంలో తుంగ చెట్లను తొలగించాలని మున్సిపల్‌ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని పలువురు వాపోయారు. ఎవరైనా నిప్పు పెట్టారా? ఎండ వేడిమికి మంటలు చెలరేగాయా అనేది తెలియరాలేదు.

మంత్రుల ఫ్లెక్సీకి క్షీరాభిషేకం

చిన్నకోడూరు(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెచడంపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం చిన్నకోడూరులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామిల ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఏఎంసీ చైర్మన్‌ మీసం మహేందర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్‌ రాజశేఖర్‌, డైరెక్టర్లు, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

సేవల ద్వారానే గుర్తింపు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): ప్రజలకు చేసే సేవల ద్వారానే మంచి గుర్తింపు లభిస్తుందని గణేశ్‌నగర్‌ ప్రసన్నాంజనేయస్వామి చారిటబుల్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు వీరబత్తిని సత్యనారాయణ అన్నారు. అమర్నాథ్‌ అన్నదాన సేవా సమితి అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికై న నందిని శ్రీనివాస్‌, గణేశ్‌నగర్‌ ముదిరాజ్‌ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై న గడీల శ్రీనివాస్‌ను ఆలయంలో శనివారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ట్రస్ట్‌ కోశాధికారి కూర శేష్‌కుమార్‌, గణేశ్‌నగర్‌ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు రాజేశం, అమర్నాథ్‌ అన్నదాన సేవా సమితి చైర్మన్‌ చీకోటి మధు, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.

లబ్ధిపొందే వరకు పోరాటం

బెజ్జంకి(సిద్దిపేట): జనాభా దామాషా ప్రకారం అన్నిరంగాలలో లబ్ధిపొందే వరకు పోరాటం చేస్తామని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ జిల్లా నాయకుడు సదన్‌ మహరాజ్‌ అన్నారు. జూన్‌ 5న సిద్దిపేటలో నిర్వహించనున్న బహిరంగసభకు చెందిన పోస్టర్లను బెజ్జంకిలో శనివారం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ పలు కులా ల ప్రజలు అన్నిరంగాలలో అన్యాయానికి గుర వుతున్నారన్నారు. జనాభా ప్రకారం లబ్ధిపొందే వరకు పోరాటం ఆగదన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు మాంకాలి సురేశ్‌, అంజిబాబు, ఉపసర్పంచ్‌ దూమాల మహేశ్‌, అంబేడ్కర్‌ ఉత్సవ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, స్వెరోస్‌ నాయకులు సురేశ్‌, నాయకులు లింగయ్య, శంకర్‌, మక్సుద్‌, రవీందర్‌, రాజు, రవి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement