సిద్దిపేటరూరల్: పచ్చిరొట్ట ఎరువుల వాడకంతో అధిక దిగుబడులు సాధించవచ్చని సిద్దిపేట ఆత్మ కమిటీ చైర్మన్ గోపీకృష్ణ సూచించారు. మండల పరిధిలోని చిన్నగుండవెల్లి గ్రామంలో శనివారం పచ్చిరొట్ట ఎరువుల విత్తనాల పంపిణీని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పచ్చిరొట్ట ఎరువులను వినియోగించడం ద్వారా భూమి సారవంతంగా మారుతుందన్నారు. తద్వారా దిగుబడులు మెరుగుపడతాయని చెప్పారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజ వ్యవసాయ విధానాలను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ నరేశ్, ఆత్మ కమిటీ డైరెక్టర్లు రజిత, జానారెడ్డి, మహేందర్, అశోక్, అజ్మత్, అంజిరెడ్డి, బాబు, కనకయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.
భూసారం మెరుగు
మిరుదొడ్డి(దుబ్బాక): పచ్చిరొట్ట సాగుతో భూసారం మెరుగవుతుందని ఏఎంసీ చైర్‌పర్సన్ బొమ్మెర సంయుక్త అన్నారు. మండల పరిధిలోని చెప్యాల క్రాస్‌రోడ్డులోని డీసీఎంఎస్ రైతుసేవా కేంద్రం, అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలో శనివారం రైతులకు పచ్చిరొట్ట విత్తలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయన ఎరువుల మోతాదును తగ్గించాలన్నారు. కార్యక్రమంలో ఏఓ సత్యాణ్వేశ్, సర్పంచ్ అంకిత, ఉపసర్పంచ్ కందిబాబు, ఏఈఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.


