ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): తెలంగాణ అభివృద్ధిని బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకేంద్రంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సీటీని రద్దుచేస్తామని ఎమ్మెల్యే హరీశ్‌రావు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఫ్యూచర్ సీటీ భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఫ్యూచర్ సిటీలో వివిధ కంపెనీలు, ప్యాక్టరీలు నెల కొల్పడంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఫ్యూచర్ సిటీని అడ్డుకోవడం అంటే రాబోయే తరాల వారి జీవితాలు అడ్డుకోవడమే అన్నారు. ఎలాంటి సంక్షేమ పథకాలు ఆపకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిపాలన కొనసాగిస్తున్నారని, సిద్దిపేట అభివృద్ధి జరగలేదని అబద్ధాలు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే బీఆర్‌ఎస్ నాయకులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్యాదారి మధు, గాయాజొద్దీన్, హర్షద్, విజయ్ డానియల్, రాజిరెడ్డి, నజ్జు, సంతోష్‌గౌడ్, బాబా, రాజు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇమామ్


