గజ్వేల్: పట్టణంలో బస్టాండ్ నిర్మాణం పూర్తయినా.. ప్రారంభించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తోందని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ చందనతో కలిసి శనివారం బస్టాండ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మూడు నెలల కిత్రమే బస్టాండ్ నిర్మాణం పూర్తయినా అందుబాటులోకి తేవడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎండల్లో బస్సుల కోసం నిరీక్షిస్తూ ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారని వాపోయారు. ప్రజ్ఞాపూర్‌లో నిర్మించిన మరో బస్టాండ్ పనులు సైతం వెంటనే పూర్తిచేయాలని, మున్సిపాలిటీలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తిచేయడంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్‌సీ రాజమౌళి, బీఆర్‌ఎస్ నాయకులు కళ్యన్‌కర్ నర్సింగరావు, నవాజ్‌మీరా, ఊడెం కృష్ణారెడ్డి, గోలీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి


