ఎన్సాన్‌పల్లిలో హై పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ | - | Sakshi
Sakshi News home page

ఎన్సాన్‌పల్లిలో హై పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌

May 24 2026 11:28 AM | Updated on May 24 2026 11:28 AM

సిద్దిపేటఅర్బన్‌: ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, జిల్లా జైలు, ఎన్సాన్‌పల్లి గ్రామానికి నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరిగే విధంగా అదనపు హై పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసినట్టు డీఈలు రామచంద్రయ్య, పండరి తెలిపారు. మండల పరిధిలోని ఎన్సాన్‌పల్లిలో వేర్వేరు ఫీడర్‌ల కోసం ఏర్పాటు చేసిన హై పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను సర్పంచ్‌ నాగుల స్రవంతి తో కలిసి శనివారం వారు ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ ఎన్సాన్‌పల్లి గ్రామంతోపాటు వ్యవసాయ కనెక్షన్ల కోసం ప్రత్యేక ఫీడర్‌ ఏర్పాటు చేశామన్నారు. మెడికల్‌ కళాశాల, జిల్లా జైలుకు ప్రత్యేకంగా ఫీడర్‌ ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి అంతరాయం కలగకుండా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఏడీఈ శ్రీనివాసులు, ఏఈ శ్రీధర్‌రెడ్డి, ఎస్‌ఎల్‌ఐ తానాజీ, ఎల్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి, లైన్‌మాన్‌ వెంకట్‌, పంచాయతీ కార్యదర్శి నర్సింగరావు, నాయకులు ప్రశాంత్‌, శ్రీనివాస్‌, కరుణాకర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, హరికిషన్‌ పాల్గొన్నారు.

ప్రారంభించిన డీఈలు

Advertisement
 
Advertisement
Advertisement