గజ్వేల్: కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. కార్మికుల వేతనాలను పెంచు తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ శనివారం గజ్వేల్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద సీఎం రేవంత్‌రెడ్డి, కార్మికశాఖామంత్రి వివేక్ చిత్రపటాలకు డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డితో కలిసి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 1.11 కోట్ల మంది కార్మికులకు లబ్ధి చేకూరనుందన్నారు. జూన్ 1 నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి వస్తాయని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే తూంకుంట


