జన గణన ప్రక్రియ షురూ.. | - | Sakshi
Sakshi News home page

జన గణన ప్రక్రియ షురూ..

May 12 2026 6:18 AM | Updated on May 12 2026 6:18 AM

డిజిటల్‌ విధానంలో వివరాల సేకరణ

సాక్షి, సిద్దిపేట: జనాభా గణన–2027 ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. 2021లో జరగాల్సిన జనాభా గణన కరోనా కారణంగా వాయిదా పడింది. సామాజిక ఆర్థిక సర్వే –2024 ప్రకారం జిల్లాలో 3.31లక్షల కుటుంబాలు ఉండగా 2041 బ్లాక్‌లుగా విభజించారు. జన గణన కోసం ఎన్యూమరేటర్లు 1,970 మంది, సూపర్‌వైజర్ల 345 మందిని, ఛార్జ్‌ సెన్సెస్‌ అధికారులను 31 మందిని నియమించారు. వీరికి ఇప్పటికే శిక్షణను ఇచ్చారు. ఈ గృహాల గుర్తింపు జూన్‌ 9వ తేదీ వరకు కానుంది. తొలి రోజు మ్యాపింగ్‌తో పాటు గృహాల గుర్తించారు. ఆ గృహాలకు నంబర్లును ఎన్యూమరేటర్లు రాశారు. స్వీయ గణనను జిల్లాలో దాదాపు 22వేల కుటుంబాలు వినియోగించుకున్నారు. ఫిబ్రవరి 2027లో జనాభా గణనను చే పట్టనున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు దాదాపు 150 ఇండ్లకు పైగా కేటాయించనున్నారు. ఎన్యూమరేటర్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా డేటాను నమోదు చేయనున్నారు. కేవలం నివాసాలే కాకుండా ... కమర్షియల్‌ భవనాలు, ఆసుపత్రులు, హోటళ్లు, కాలేజీ ఇలా అన్నింటిని సర్వేలో కవర్‌ చేయనున్నారు.

తొలి రోజు గృహాల మ్యాపింగ్‌, గుర్తింపు

జూన్‌ 9వ తేదీ వరకు కొనసాగనున్న కార్యక్రమం

స్వీయ గణన చేసుకున్న 22వేల కుటుంబాలు

సిద్దిపేటఅర్బన్‌: మండలంలోని ఆయా గ్రామాలలో ఇంటింటి సర్వే ప్రక్రియను సర్పంచ్‌లు ప్రారంభించారు. సూపర్‌వైజర్ల ఆధ్వర్యంలో ఎన్యూమరేటర్లు ఆయా గ్రామాలలో తొలి రోజు సర్వే నిర్వహించారు. జనగణనలో భాగంగా అధికారులు ఇంటింటికి తిరుగుతూ వివరాలను డిజిటల్‌ విధానంలో సేకరించనున్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement