వాహనాలు ఇవ్వడం లేదు
● కలెక్టర్ హైమావతి
● అధికారులకు దిశానిర్దేశం
సిద్దిపేటకమాన్: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫిర్యాదుదారుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజావాణిలో జిల్లాలో మొత్తం 94 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు, తదితరులు తదితరులు పాల్గొన్నారు.
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా మహిళా మత్య్స పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు మహిళా కేటగిరిలో ఇచ్చే వాహనాలను ఇవ్వడం లేదు. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకువచ్చిన కూడా వాహనాలు ఇవ్వకపోవడం విడ్డూరం. సంబంధిత అధికారులు వాహనాలు ఇప్పించాలి.
– బర్ల సత్యనారాయణ, పొన్నాల


