సిద్దిపేటజోన్: హైదరాబాద్ తరహాలో త్వరలో సిద్దిపేట శ్రీరామకుంట శ్మశానవాటికలో గ్యాస్ ఆధారిత మిషన్ ద్వారా దహన సంస్కారాలు నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం శ్రీరాంకుంట వైకుంఠధామాన్ని ఆయన పరిశీలించారు. పరిశుభ్రత, మౌలిక వసతుల కల్పన అంశాలపై అరా తీశారు. చలికాలంలో వేడి నీరు రావడం లేదని వెంటనే పనులు చేపట్టాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్, మాజీ చైర్మన్ రాజనర్స్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సంపత్ రెడ్డి యువజన విభాగం అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరింత ఉన్నతంగా ఎదగాలి..
భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో ఎదగాలని హరీశ్‌రావు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లింగారెడ్డిపల్లికి చెందిన ప్రియాంక ఇంటర్ ఫలితాల్లో 991మార్కులు సాధించిన సందర్భంగా ఆమెను ఎమ్మెల్యే అభినందించారు. అంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ పొందిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పరిశోధన విద్యార్థి బలరాంను అభినందించారు. డాక్టరేట్ పొందడం సిద్దిపేట ప్రజలందరికి గర్వకారణమన్నారు.


