
ఆరోగ్యంపై మహిళలు శ్రద్ధ వహించాలి
హుస్నాబాద్: ప్రస్తుతం 90 శాతం రోగాలు ఆహారం ద్వారానే వస్తున్నాయని, మహిళలు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హైమావతి అన్నారు. బుధవారం పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ నెల 17 నుంచి వచ్చే నెల 2 వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మహిళలకు, కౌమార దశ బాలికలకు వైద్య శిబిరాలు నిర్వహించడం ఈ కార్యక్రమ ఉద్దేశ్యం. కలెక్టర్ మాట్లాడుతూ కుటుంబంలో మహిళా ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మునగాకు, పప్పులు, ఆకుకూరలు సమపాళ్లల్లో తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఆస్పత్రిలో ఆయా వైద్య శిబిరాలను ప్రారంభించారు.