
కురిసిన వాన.. మురిసిన రైతన్న
జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. కొద్ది రోజులుగా మొఖం చాటేసిన వానలు రెండు రోజులుగా కురుస్తుండటంతో రైతులు సంబరపడుతున్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు 150.8మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ధూళ్మిట్ట మండలంలో 37.5మి.మీ, జగదేవ్‌పూర్‌లో 25.3మి.మీ, అక్కన్నపేటలో 24.1మి.మీ, కోహెడలో 15.7మి.మీ, మద్దూరులో 13.4మి.మీ, కొమురవెల్లి మండలంలో 10మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నిలిచిన రాకపోకలు
అక్కన్నపేట మండలంలో వర్షం కుమ్మేసింది. దాదాపు గంటన్నర పాటు వర్షం కురవడంతో వాగులు ఉప్పొంగాయి. నందారం మీదుగా కపూర్‌నాయక్‌తండాకు వెళ్లే దారిలో ఉన్న కల్వర్టుపై వరద ఉధృతితో రాకపోకలు నిలిచాయి. పంటపొలాల్లో వరద నిలిచింది. చేర్యాలలోనూ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి.
– ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)/చేర్యాల/
అక్కన్నపేట(హుస్నాబాద్)