
కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగునీటి ఇబ్బందులు
ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేటరూరల్: కాంగ్రెస్ ప్రభుత్వంలో సాగునీటి ఇబ్బందులు తప్పడంలేదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పుల్లూరులో దుర్గామాత ప్రథమ వార్షికోత్సవంలో హరీశ్‌రావు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు సమృద్ధిగా కురవాలన్నారు. సకాలంలో కాళేశ్వరం గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయకపోవడంతో రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టులో నీళ్లు ఉంటే నేడు పంటలకు బాగుండేదన్నారు. కార్యక్రమంలో సుడా మాజీ చైర్మన్ రవీందర్‌రెడ్డి, మాజీ జెడ్‌పీటీసి శ్రీహరిగౌడ్, మాజీ సర్పంచ్ నరేశ్, నాయకులు పాల్గొన్నారు.
విద్యావ్యవస్థ నిర్వీర్యం
చిన్నకోడూరు(సిద్దిపేట): కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతోందని, ఇప్పటి వరకు విద్యారంగానికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. శుక్రవారం చిన్నకోడూరు ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పాలనలో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ బడులను బలోపేతం చేశామన్నారు. విద్యార్థులు సోషల్ మీడియాకు, సెల్ ఫోన్‌లకు దూరంగా ఉండాలన్నారు. అలాగే చిన్నకోడూరు పెద్ద చెరువు కట్టపై ఏర్పాటు చేసిన కట్ట మైసమ్మ విగ్రహ ప్రతిష్టలో పాల్గొని హరీశ్‌రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, నాయకులు పాల్గొన్నారు.