
రిజర్వేషన్లకు పార్టీలన్నీ మద్దతివ్వాలి
దుబ్బాక: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 42 శాతం బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్‌లో బిల్లు పాస్ అయ్యేలా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుండబోయిన వెంకటేశ్వర్ అన్నారు. శుక్రవారం ఆయన దుబ్బాక పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. బీసీ లకు మద్దతు ఇవ్వని పార్టీలను ఎన్నికల్లో ఓటు వేయకుండా తరిమికొడదామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్, గంగపుత్ర సంఘం నాయకుడు రాంచంద్రం, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కిషన్, ప్రధాన కార్యదర్శి మంతూరి సందీప్, పోలబోయిన నారాగౌడ్, జిందం గాలయ్య, నీలగిరి శ్రీనివాస్, దేవుని చంద్రయ్య, మాడబోయిన సిద్ధిరాములు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్