కానరాని సీసీ.. అంతా ఛీఛీ | - | Sakshi
Sakshi News home page

కానరాని సీసీ.. అంతా ఛీఛీ

Jul 10 2025 8:22 AM | Updated on Jul 10 2025 8:24 AM

సీసీరోడ్లకు మోక్షమెప్పుడో?
● శంకుస్థాపనలకే పరిమితం ● నిధులు మంజూరైనా ప్రారంభంకాని పనులు ● అధ్వానంగా లోతట్టు ప్రాంతాలు ● కొత్త కాలనీలో రోడ్లపైనే మురుగు ● హుస్నాబాద్‌ మున్సిపాలిటీ దుస్థితి

మట్టిరోడ్ల రహిత పట్టణంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం.. పాలకుల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. నిధులు మంజూరై నెలలు గడుస్తున్నా నేటికీ పనులు ప్రారంభించలేదు. రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ పట్టణంలోని ప్రతి వార్డుకూ నిధులు మంజూరు చేసింది. దీంతో సీసీ రోడ్లతో పాటు మురికి కాలువలు నిర్మించాల్సి ఉంది. కానీ చాలా వార్డుల్లో శంకుస్థాపనలకే పరిమితం చేశారు. దీంతో చిరుజల్లులు కురిసినా అంతర్గత దారులు చిత్తడిగా మారుతున్నాయి. రోడ్లపైనే నీరు నిలిచి దుర్గంధం వ్యాపిస్తోంది.

– హుస్నాబాద్‌

హుస్నాబాద్‌ పట్టణంలో 20 వార్డులు ఉన్నాయి. ఒక్కో వార్డుకు రూ.50లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. ఇటీవల మున్సిపల్‌ కార్యాలయంలో అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్‌ హైమావతి సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. పలు వార్డుల్లో వివిధ కారణాలతో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. లోతట్టు ప్రాంతాల్లో వర్షం వస్తే వరద నీటితో ఇళ్లు, కాలనీలు జలమయం కావడం పరిపాటిగా మారింది. దాదాపు 30 ఏళ్ల క్రితం నిర్మించిన మురికి కాలువలు వరద నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక రోడ్లను ముంచెత్తి ఇళ్లలోకి వస్తున్నాయి. కొత్త కాలనీల్లో పలుచోట్ల సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టినా.. మురికి కాలువలు నిర్మించకపోవడంతో మురుగునీరంతా ఇళ్ల మధ్యే నిలిచిపోతోంది. అసలే వానాకాలం. వరద నీటితో మట్టి రోడ్లు బురదగా మారి నడిచే వారికి, వాహనదారులకు ప్రాణ సంకటంగా మారుతున్నాయి.

సీసీ రోడ్లు నిర్మించండి

హుస్నాబాద్‌లోని 3వ వార్డులో సీసీ రోడ్డు, మురికి కాలువల నిర్మాణాలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ శంకుస్థాపన చేశారు. 8 నెలలు గడుస్తున్నా నేటికీ పనులు ప్రారంభించలేదు. మా కాలనీ లోట్టు ప్రాంతం. వరద నీటి ప్రవాహంతో రోడ్లు జలమయమై ఇళ్లలోకి నీరు చేరుతుంది. వరద నీటితో రోజుల తరబడి జాగారం చేయాల్సి వస్తోంది. అధికారులు తక్షణం సీసీరోడ్లు, మురికి కాలువలు నిర్మించాలి.

– పూదరి రవీందర్‌గౌడ్‌,

హుస్నాబాద్‌

రోడ్ల మధ్యే విద్యుత్‌ స్తంభాలు..

హుస్నాబాద్‌ పట్టణంలోని నేతాజీ కాలనీలో ఇటీవల సీసీ రోడ్లు నిర్మించారు. ప్రతి రోడ్డును 18 ఫీట్లతో నిర్మించారు. అయితే విద్యుత్‌ స్తంభాలు తొలగించకుండానే సీసీ రోడ్లు వేయడంతో అవి రోడ్డు మధ్యకు వచ్చాయి. సీసీ రోడ్ల నిర్మాణంలో మున్సిపల్‌ ఇంజనీరింగ్‌, విద్యుత్‌ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడమే ఇందుకు కారణం. రోడ్ల మధ్యనే విద్యుత్‌ స్తంభాలు ఉన్నప్పటికీ సదరు కాంట్రాక్టర్‌ సీసీ రోడ్లు నిర్మించి చేతుల దులుపుకొన్నారు. దీంతో వాహనారులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.

హుస్నాబాద్‌ మున్సిపాలిటీ

వార్డులు: 20

జనాభా: 32,000 పైగానే..

రోడ్లు: 74.825 కి.మీ.

సీసీ రోడ్లు: 38.045 కి.మీ.

బీటీ రోడ్లు: 18.390 కి.మీ.

మట్టి రోడ్లు: 18.390 కి.మీ.

కానరాని సీసీ.. అంతా ఛీఛీ 1
1/5

కానరాని సీసీ.. అంతా ఛీఛీ

కానరాని సీసీ.. అంతా ఛీఛీ 2
2/5

కానరాని సీసీ.. అంతా ఛీఛీ

కానరాని సీసీ.. అంతా ఛీఛీ 3
3/5

కానరాని సీసీ.. అంతా ఛీఛీ

కానరాని సీసీ.. అంతా ఛీఛీ 4
4/5

కానరాని సీసీ.. అంతా ఛీఛీ

కానరాని సీసీ.. అంతా ఛీఛీ 5
5/5

కానరాని సీసీ.. అంతా ఛీఛీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement