
కొండపోచమ్మ హుండీ ఆదాయం రూ. 9.78 లక్షలు
జగదేవ్‌పూర్(గజ్వేల్): తిగుల్‌నర్సాపూర్ సమీపంలో ప్రసిద్ధిగాంచిన కొండపోచమ్మ ఆల యం హుండీ కానుకలను దేవాదాయశాఖ ఆధ్వర్యంలో బుధవారం లెక్కించారు. 89 రోజులకు గాను రూ.9,78,872 నగదుతో పాటు 057.8 గ్రాముల మిశ్రమ బంగారం, 2 కేజీల మిశ్రమ వెండి ఆభరణాలు వచ్చినట్లు సిద్దిపేట డివిజన్ ఇన్‌స్పెక్టర్ విజయలక్ష్మి, ఆలయ ఈఓ రవికుమార్ తెలిపారు. వచ్చిన ఆదాయాన్ని అమ్మవారి ఖాతాలో జమ చేయనున్నట్లు చెప్పారు.
నేడు నాచగిరిలో వేలం
వర్గల్(గజ్వేల్): నాచగిరి క్షేత్రంలో వివిధ వస్తువులకు గురువారం వేలం పాట నిర్వహించనున్నారు. టెంటు సామగ్రి, చీరలు–దోవతులు, ఒడి బియ్యం, తలనీలాలు, పాదరక్షలు, శాలువాలు, శెల్లాలు, కనుములు, రక్షా కంకణాలు, పూలమాలలు, పూల అలంకరణ, వెండి, రాగి డాలర్లకు సంబంధించి ఆలయ ప్రాంగణంలో వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఈఓ విజయరామారావు తెలిపారు.
భూములు ఇచ్చే ప్రసక్తేలేదు
సర్వేను అడ్డుకున్న గిరిజన రైతులు
అక్కన్నపేట(హుస్నాబాద్): తాతముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూములను ఇచ్చే ప్రసక్తే లేదని గిరిజన రైతులు సృష్టం చేశారు. సర్వే చేస్తున్న అధికారులను అడ్డుకున్నారు. మండలంలోని రామవరం, గండిపల్లి, కుందనవానిపల్లి గ్రామాల శివారులోని సర్వే నంబర్ 97లో అటవీ, రెవెన్యూ అధికారులతో పాటు సర్వేయర్లు రాగా సర్వే నిర్వహించవద్దంటూ పలువురు రైతులు అడ్డుకొని నిలదీశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. రాళ్లురప్పులను చదను చేసుకొని ఏళ్లుగా సాగు చేస్తూ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నామన్నారు. ఇప్పడు, ఆ భూములను అటవీ శాఖకు అప్పగిస్తామంటే ఊరుకునే ప్రసక్తేలేదన్నారు. భూములను అటవీశాఖకు ఇచ్చి తమ పొట్టకొట్టవద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. కార్యక్రమంలో గిరిజన రైతులు నరసింహనాయక్, మాలోతు కుమారస్వామి, ఈర్యనాయక్, ఫుల్‌సింగ్, నందు, తిరుపతి, ప్రసాద్, రాజు, రమేశ్ పాల్గొన్నారు.
యూరియా కోసం తిప్పలు
దౌల్తాబాద్ (దుబ్బాక): వానాకాలం పంటలు వేయడానికి సమయం ఆసన్నమైనా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి బుధవారం 500 బస్తాల యూరియా వచ్చింది. దీంతో రైతులు బారులు తీరారు. ఒక్కో రైతుకు 3 బస్తాల చొప్పున అందించారు. కొందరికి దొరకక వెనుదిరిగారు. అధికారులు కల్పించుకుని రైతులందరికీ యూరియా అందించాలని కోరుతున్నారు.

కొండపోచమ్మ హుండీ ఆదాయం రూ. 9.78 లక్షలు

కొండపోచమ్మ హుండీ ఆదాయం రూ. 9.78 లక్షలు