
అభివృద్ధి పనులు వేగిరం చేయాలి
● నిర్దిష్ట ప్రమాణాలతో పూర్తి చేయాలి ● కలెక్టర్ హైమావతి
సిద్దిపేటరూరల్: జిల్లాలో చేపట్టిన అన్ని రకాల అభివృద్ధి పనులు వేగిరం చేయడమేకాక, నిర్దిష్ట ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఈడబ్ల్యూఐడీసీ, ఆర్‌అండ్‌బీ శాఖల పనితీరుపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రోడ్డు నిర్మాణ పనులకు సంబంధించి ఉన్న ఇబ్బందులు, అనుమతులు, టెండర్, నిధులు అంశాలపై చర్చించారు. భవన నిర్మాణాల పనులపై నివేదిక అందించాలన్నారు. ఇంకా నిర్మించాల్సిన వాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఈ చిరంజీవులు, అర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఇన్‌చార్జి ఈఈ సర్దార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల లబ్ధిదారుల నుంచి స్పందన
సిద్దిపేటకమాన్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి మంచి స్పందన వస్తుందని కలెక్టర్ తెలిపారు. సిద్దిపేట పట్టణం 37వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్‌తో కలిసి కలెక్టర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..400 చదరపు అడుగుల మేర ఉన్న ఇళ్లను మాత్రమే గ్రౌండింగ్ చేయడం జరుగుతుందన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు గ్రౌండింగ్ పూర్తి చేస్తామన్నారు.