
● నర్సరీ నుంచే పుస్తకాల మోత ● కమీషన్లకు ఆశపడి ఎక్కువ బ
ఈ ఫొటోలో కనిపిస్తున్నది సిద్దిపేట లోని ఓ ప్రైవేట్ స్కూల్ 1వ తరగతి చదువుతున్న చిన్నారి పుస్తకాల బ్యాగు. ఈ బ్యాగులో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తదితర నోట్ బుక్స్.. మొత్తంగా 14 ఉన్నాయి. దీంతో 6కిలోల 62గ్రాముల బరువు ఉంది. ఈ బ్యాగును స్కూల్ వరకు తల్లిదండ్రులు తీసుకువచ్చినా.. స్కూల్ గేట్ నుంచి చిన్నారి మోయలేకపోతోంది. ‘నా బిడ్డ బ్యాగ్ మోయలేకపోతోంది.. కొన్ని బుక్స్ స్కూల్‌లోనే పెట్టి.. హోం వర్క్, రీడింగ్ ఉన్న బుక్స్ మాత్రమే ఇంటికి పంపించండి’ అని స్కూల్ యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోవడం లేదని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పుస్తకాలను రూ.5,600 వెచ్చించి పాఠశాలకు చెందిన స్టాల్‌లో కొనుగోలు చేశారు. ఇలా ప్రైవేటు పాఠశాలల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.