కడుపునిండా కమ్మని భోజనం | - | Sakshi
Sakshi News home page

కడుపునిండా కమ్మని భోజనం

May 10 2025 2:11 PM | Updated on May 10 2025 2:11 PM

కడుపు

కడుపునిండా కమ్మని భోజనం

ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నదానం

పేదల ఆకలి తీరుస్తున్న ట్రస్ట్‌

రోజూ సుమారు 125 మందికి వితరణ

365 రోజులూ

భోజనం అందించాలని సంకల్పం

స్టీల్‌ ప్లేట్ల వినియోగం

న్నదాన కార్యక్రమంలో పేపర్‌ ప్లేట్‌ కాకుండా స్టీల్‌ ప్లేట్లను వినియోగిస్తున్నారు. సేవతో పాటుగా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్నారు. పేపర్‌ ప్లేట్లు, పేపర్‌ గ్లాసులు వాడకం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని, స్టీల్‌ ప్లేట్లు, స్టీల్‌ గ్లాస్‌లు వాడుతున్నారు. పర్యావరణాన్ని కాపాడటమే కాకుండా శుచి, శుభ్రత పాటిస్తున్నారు.

హుస్నాబాద్‌: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారికి కడుపు నిండా భోజనం పెడుతోంది ఆర్యవైశ్య ట్రస్ట్‌. 365 రోజులూ అన్నదానం చేయాలనే సంకల్పానికి శ్రీకారం చుట్టింది. హుస్నాబాద్‌కు చెందిన ఆర్యవైశ్యులు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు భోజనం అందించేందుకు ఆర్యవైశ్య అన్నప్రసాద వితరణ ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు. 20 మందితో ఏర్పడిన ట్రస్ట్‌లో ప్రస్తుతం 170 మంది సభ్యులున్నారు. ప్రతి సభ్యుడు రూ.5వేలు చెల్లించి సభ్యత్వం తీసుకుంటున్నారు. ట్రస్ట్‌ ద్వారా వచ్చే నిధులతో ప్రభుత్వ ఆస్పత్రిలో వారంలో నాలుగు రోజులు, రోజుకు 100 నుంచి 125 మందికి భోజనం పెడుతున్నారు. 365 రోజులూ అన్నదానం చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. 47 రోజులుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. అలాగే సభ్యత్వం తీసుకోని ఆర్యవైశ్యుల్లో ఎవరైనా పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుకల సందర్భంగా ట్రస్ట్‌కు రూ.5వేలు చెల్లిస్తే వారి పేరిట కూడా అన్నదానంతో పాటు అరటి పండ్లు, ఏదైనా స్వీటు ఇచ్చి ఈ మహాకార్యాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన శాశ్వత రేకుల షేడ్‌లోనే అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగుతోంది. రెండు రకాల కూరలు, సాంబారు, చెట్ని, మజ్జిగ, అరటి పండ్లతో భోజనం పెడుతున్నారు. ఆస్పత్రిలో చేరిన పేషెంట్లకు కాకుండా వారి సహాయకులుగా వచ్చిన వారికే ఈ భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. పేషంట్లకు ఆస్పత్రి వర్గాలే డాక్టర్ల సూచన మేరకు భోజనం కల్పిస్తున్నారు. పేషంట్లకు తోడుగా వచ్చే కుటుంబ సభ్యులు ఆకలికి ఇబ్బంది పడకుండా భోజనం పెట్టి కడుపు నింపుతున్నారు. వీరితో పాటుగా ఆస్పత్రిలో పని చేసే సిబ్బంది కూడా భోజనం చేసి ఆకలిని తీర్చుకుంటూ అన్నదాత సుఖీభవ అని దీవిస్తున్నారు. ఈ మహా కార్యాన్ని రాష్ట్రంలోనే కరీంనగర్‌లో ఆర్యవైశ్యులు మొదటగా ప్రభుత్వ ఆస్పత్రిలో శ్రీకారం చుట్టారు. రెండోవది హుస్నాబాద్‌ ఆర్యవైశ్యులే. ఈ ట్రస్ట్‌లో కేవలం ఆర్యవైశ్యులకు మాత్రమే సభ్యత్వం ఉంటుంది.

భవిష్యత్‌లో నిరంతరం

ఆర్యవైశ్యుల సహకారంతో వారానికి నాలుగు రోజులు మాత్రమే భోజనం అందిస్తున్నాం. భవిష్యత్‌లో నిధిని బట్టి నిరంతరం భోజన సౌకర్యం కల్పిస్తాం. ప్రస్తుతం 365 రోజులు అనుకున్నాం. ట్రస్ట్‌లో చేరేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. పేదలకు అన్నదానం చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. – చందా శ్రీనివాస్‌,

ట్రస్ట్‌ సభ్యుడు, హుస్నాబాద్‌

కడుపునిండా కమ్మని భోజనం1
1/2

కడుపునిండా కమ్మని భోజనం

కడుపునిండా కమ్మని భోజనం2
2/2

కడుపునిండా కమ్మని భోజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement