అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు

Published Sun, Apr 14 2024 7:55 AM

అగ్నిమాపక వారోత్సవాల
వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌  - Sakshi

● కలెక్టర్‌ మిక్కిలినేని మను చౌదరి ● అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్‌ ఆవిష్కరణ

సిద్దిపేటరూరల్‌: వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ మిక్కిలినేని మను చౌదరి అధికారులను ఆదేశించారు. శనివారం అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాల వాల్‌ పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయన్నారు. ఏప్రిల్‌ 14 నుంచి 20 వరకు జరిగే వారోత్సవాల్లో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే 101 నంబర్‌ కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో సహాయ జిల్లా అగ్నిమాపక అదికారి సురేష్‌ కుమార్‌, అగ్ని మాపక కేంద్రీయ అధికారి రాజు కుమార్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement