కాంగ్రెస్‌ వైపే ప్రజల మొగ్గు | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ వైపే ప్రజల మొగ్గు

Published Thu, Nov 9 2023 5:56 AM

సిద్దిపేటలో నామినేషన్‌ వేస్తున్న 
కాంగ్రెస్‌ అభ్యర్థి హరికృష్ణ   - Sakshi

సిద్దిపేట అభ్యర్థి హరికృష్ణ

సిద్దిపేటజోన్‌: ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమని సిద్దిపేట కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి హరికృష్ణ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో పార్టీ అభ్యర్థిగా రెండో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభంజనం రానుందని, ప్రజలు కాంగ్రెస్‌ను దీవించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. అంతకుముందు పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు మహేందర్‌ రావు, యాదగిరి, కలిముద్దీన్‌, అత్తు తదితరులు పాల్గొన్నారు

రక్షకులకు, వ్యతిరేకులకు మధ్య పోటీ.: డీఎస్పీ అభ్యర్థి బాబు

సిద్దిపేటజోన్‌: ఎన్నికల్లో రాజ్యాంగ రక్షకులకు, రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు మధ్య పోటీ జరుగుతుందని ధర్మ సమాజం పార్టీ(డీఎస్పీ)అభ్యర్థి బాబు అన్నారు. బుధవారం సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం డీఎస్పీ పాటుపడుతుందని, ఎన్నికల్లో ఆదరించాలని కోరారు.

 
Advertisement
 
Advertisement