
శ్రీ సీతారామచంద్ర ఆలయంలో కల్యాణం తిలకిస్తున భక్తులు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): శ్రీరామనవమి ఉత్సవాలు జిల్లావ్యాప్తంగా ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. గురువారం పలు ఆలయాల్లో శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాల వద్ద భక్తుల సందడి నెలకొంది. సిద్దిపేట పట్టణమంతా శ్రీరామనామంతో మార్మోగింది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాల్లో మంత్రి తన్నీరు హరీశ్‌రావు పాల్గొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నంలోపు పట్టణంలోని 22 ఆలయాలల్లో శ్రీ సీతారాముల కల్యాణ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని గణేష్‌నగర్ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో స్వామి వారికి వెండి గద, ఇతర అలంకరణ వస్తువులు అందించారు. శ్రీనగర్ కాలనీ, హౌసింగ్‌బోర్డు కాలనీ, హరిప్రియనగర్, శివాజీనగర్, హనుమాన్‌నగర్, శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం, గాంధీ నగర్, శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం, వడ్డెర కాలనీ, సంతోష్‌నగర్, సుభాష్‌నగర్, కళ్లకుంట కాలనీ, ససీతారాంనగర్, బాలంజనేయస్వామి, అభయాంజనేయ స్వామి, ఖాదర్‌పూర, నాసర్‌పూర, నర్సాపూర్, పాతగంజి, శ్రీ రేణుకనగర్, మహాశక్తినగర్, శ్రీనివాసనగర్, తదితర కాలనీలలోని ఆలయాలలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ ఉత్సవాల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొని, పట్టు వస్త్రాలు అందించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వాడవాడలా రాములోరి ఉత్సవాలు
హాజరైన మంత్రి హరీశ్‌రావు

కల్యాణశోభలో శ్రీ సీతారాములు

గణేష్‌నగర్ ప్రసన్నాంజనేయస్వామికి వెండిగదను అందిస్తున్న మంత్రి హరీశ్‌రావు