ట్రాన్స్‌ బర్నర్లు | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ బర్నర్లు

May 24 2026 11:28 AM | Updated on May 24 2026 11:28 AM

ట్రాన్స్‌ బర్నర్లు ● కాలిపోతున్న ట్రాన్స్‌ ఫార్మర్లు ● మరమ్మతుల్లో జాప్యం జహీరాబాద్‌ నియోజకవర్గంలోని ఐదు మండలాలకు కలిపి జహీరాబాద్‌ పట్టణంలో ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రం ఉంది. పలు కారణాల వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు కాలడంతో మరమ్మతుల కేంద్రానికి పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 200 వరకు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. ఇందులో చాలావరకు 25 కేవీ, 63 కేవీ, 100 కేవీ ట్రాన్స్‌పార్మర్లు ఉన్నాయి. గ్రామాల్లోని సింగల్‌ ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కూడా పెద్ద సంఖ్యలో కాలుతున్నాయి. ఉరుములు, ఈదురుగాలులకు కరెంట్‌ సరఫరాలో తరచూ లోపాలు ఏర్పడుతున్నాయి. కరెంట్‌ తీగలు వేలాడటం వల్ల గాలులు వీచినప్పుడు ఒకదానికి ఒకటి తాకడంతో షార్టు సర్క్యూట్‌తో ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతోపాటు కాలిపోతున్నాయి. కాలిన ట్రాన్స్‌ఫార్మర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల మరమ్మతుల్లో జాప్యం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. కార్మికులు రోజూ రెండు, మూడు మాత్రమే మరమ్మతులు చేయగలుగుతారు. ప్రతీరోజు పదుల సంఖ్యలో రావడం వల్ల్ల ఒక్కోసారి మరమ్మతులకు వారం రోజులు కూడా పడుతుంది.

ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే గ్రామాల నుంచి రిపేరింగ్‌ సెంటర్‌ వరకు డిపార్ట్‌మెంట్‌కు చెందిన వాహనంలో తీసుకెళ్లి...మరమ్మతులు అయిన తర్వాత మళ్లీ తీసుకొచ్చి బిగించాల్సి ఉంటుంది. కానీ విద్యుత్‌ శాఖలో వాహనాల సంఖ్య తక్కువగా ఉన్నందున మరమ్మతుల్లో జాప్యం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో రైతులే ట్రాక్టర్‌, ఆటోలో మరమ్మతుల కేంద్రానికి తీసుకొస్తున్నారు.

● కాలిపోతున్న ట్రాన్స్‌ ఫార్మర్లు ● మరమ్మతుల్లో జాప్యం
పెరిగిన విద్యుత్‌ వినియోగం

బోరు బావుల కింద రైతులు పంటలు వేయడం వల్ల విద్యుత్‌ వినియోగం బాగా పెరిగింది. ఎండలతోపాటు ఓవర్‌ లోడ్‌, విద్యుత్‌ సరఫరాలో లోపాలు, సాంకేతిక ఇబ్బందులు వంటి సమస్యల వల్ల అగ్రికల్చర్‌తోపాటు సింగల్‌ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. కాలిన ట్రాన్స్‌ఫార్మర్లు పెద్ద సంఖ్యలో రిపేరింగ్‌ సెంటర్‌కు రావడంతో మరమ్మతుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

జహీరాబాద్‌ టౌన్‌:

రైతులకు తప్పని తిప్పలు

Advertisement
 
Advertisement
Advertisement