జహీరాబాద్: జహీరాబాద్ మున్సిపాలిటీలో నిర్వహించాల్సి ఉన్న కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక మరోసారి వాయిదా పడింది. కో– ఆప్షన్ ఎన్నికను శనివారం నిర్వహిస్తున్నట్లు మొదట్లో అధికారులు ప్రకటించారు. తిరిగి పలు కారణాల చేత వాయిదా వేస్తున్నట్లు సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఎన్నిక వాయిదా పడినట్లు తెలుసుకున్న సభ్యులు మున్సిపాలిటీ వైపు కన్నెత్తి చూడలేదు. అధికారులు సైతం అత్యవసర సమావేశానికి తరలివెళ్లినట్లు సమాచారం. ఎన్నిక వాయిదా పడేందుకు కారణాలు తెలియరాలేదు. కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహణ కోసం కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లేనందునే వాయిదా పడిఉండవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో సైతం ఎన్నిక తేదీని ప్రకటించినా తగినంత కోరం లేనందున వాయిదా పడిన సంగతి తెలిసిందే. జహీరాబాద్: నేల బాగు కోసమే పచ్చిరొట్ట సాగును ప్రోత్సహిస్తున్నామని ఏడీఏ భిక్షపతి పేర్కొన్నారు. జహీరాబాద్‌లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 50% సబ్సిడీపై జనుము, జీలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం ఆత్మ చైర్మన్ రామలింగారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ...నేల ఆరోగ్యం మెరుగుపడేందుకు సేంద్రీయ ఎరువుల పాత్ర చాలా కీలకమైందన్నారు. నేలలో 6–7వారాలు జనుము సాగు చేసుకుని, తేమ ఉన్న సమయంలో భూమిలో కలియదున్నాలని సూచించారు. వీటివల్ల భూమిలో సేంద్రీయ కర్బనం పెరిగి, భూసారం పెరుగుతుందన్నారు. జనుములు 40 కిలోల బస్తా 50%సబ్సిడీ పోను రైతు చెల్లించాల్సిన ధర రూ.3,110 ఉందని తెలిపారు. ఈ పంపిణీ ఓఎస్‌ఎస్‌డీఎస్ ఆన్‌లైన్‌లో పోర్టల్ ద్వారా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. జహీరాబాద్ డివిజన్‌లోని ఐదు మండలాల్లో ఏడు సబ్సిడీ కౌంటర్లను కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ ముబీన్, ఏఓ లావణ్య, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
పచ్చిరొట్ట సాగుతో
భూసారం వృద్ధి
సబ్సిడీపై జనుము విత్తనాలు అందజేత
మాజీ సర్పంచ్
రూ.3 కోట్ల భూమి విరాళం
సదాశివపేట రూరల్ (సంగారెడ్డి): గజం స్థలం కోసం గొడవలు పడే ఈరోజుల్లో దాదాపుగా రూ.3 కోట్లు విలువ చేసే 30 గుంటల భూమిని ప్రభుత్వానికి ఉచితంగా గిఫ్ట్ డీడ్ చేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆత్మకూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అమరేందర్‌రెడ్డి. ఆత్మకూర్‌లో ప్రజా వైద్యశాలకు తన పూర్వీకులు 30 గుంటల భూమిని అందజేశారు. అయితే నాడు రిజిస్ట్రేషన్ కాలేదు. దీంతో తన పూర్వీకులు ఆశయాన్ని నిలబెడుతూ..ఆస్పత్రి పేరిట శనివారం గిఫ్ట్ డీడ్ చేసి జిల్లా వైద్యాధికారి వసంత రావుకు విరాళంగా అందజేశారు. రూ.కోట్ల విలువ చేసే భూమిని ప్రభుత్వానికి అందజేసిన అమరేందర్‌రెడ్డిని గ్రామ, మండల ప్రజలు అభినందించారు. కార్యక్రమంలో సత్యం పంతులు, రమేశ్, ప్రభు, వీరన్న, సదాశివుడు, జగదీశ్వర్, శివ కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఓఎస్‌ల పదోన్నతికి
కృషిచేయాలి
సంగారెడ్డి: ఓఎస్‌లకు ప్రమోషన్లు కల్పించేందుకు కృషి చేయాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి జానకిరెడ్డిని తెలంగాణ పంచాయతీ రాజ్ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు కోరారు. ఉద్యోగులను 40%తో బదిలీలు చేసినందుకు ఉద్యోగుల సంఘం నాయకులు జానకిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నర్సింహులు, ప్రధాన కార్య దర్శి రాహుల్, పంచాయతీ రాజ్ మినిస్తియ్రల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సూర్యకాంత్, ప్రధాన కార్యదర్శి రఘు తదితరులు పాల్గొన్నారు.