ప్రజా సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలు పరిష్కరించాలి

May 24 2026 11:28 AM | Updated on May 24 2026 11:28 AM

సంగారెడ్డి: జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్‌, మాణిక్‌రావు, గూడెం మహిపాల్‌రెడ్డి కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ను కోరారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కలసి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మాణిక్‌రావు మాట్లాడుతూ..జహీరాబాద్‌ నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, కొత్త బోర్‌వెల్స్‌ మంజూరు చేసి సమస్యను పరిష్కరించాలన్నారు. ఎమ్మెల్యే కోట కింద 40% ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిపాల్‌రెడ్డి తన నియోజకవర్గంలో నెలకొన్న ఇరిగేషన్‌ సమస్యలను కలెక్టర్‌కు వివరించారు. సాగునీటి ఇబ్బందులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. చింతా ప్రభాకర్‌ మాట్లాడుతూ..ప్రభుత్వం ఎకరాకు 10 క్వింటాళ్ల జొన్నలను మాత్రమే కొనుగోలు చేస్తోందన్నారు. కనీసం ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు ఆంక్షలు లేకుండా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకో వాలని కోరారు. ఇందుకు కలెక్టర్‌ సానుకూలంగా స్పందిస్తూ..సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంజీవ్‌రెడ్డి, తట్టు నారాయణ, మాజీ సీడీసీ చైర్మన్‌ కాసాల బుచ్చిరెడ్డి, చింత సాయినాథ్‌, గోవర్ధన్‌ నాయక్‌, సర్పంచ్‌ హరివర్ధన్‌ ఉన్నారు.

కలెక్టర్‌ను కలిసిన ముగ్గురు ఎమ్మెల్యేలు

Advertisement
 
Advertisement
Advertisement