150 లీటర్ల డీజిల్ చోరీ
జోగిపేట(అందోల్): పట్టణంలో సోమవారం అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ చేసింది. పట్టణంలోని ఆక్స్‌ఫర్డ్ పాఠశాల ఆవరణలోని సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. వివరాలు ఇలా... ఆక్స్‌ఫర్డ్ పాఠశాల గోడకు దగ్గరగా కారు నిలిపారు. అందులో నుంచి ముగ్గురు యువకులు బయటకు దిగారు. వారంతా చెడ్డీలు ధరించి ఉన్నారు. పాఠశాలలోని ప్రహరిగోడ దూకి పాఠశాల బస్సుల నుంచి సుమారు 50 లీటర్ల డీజిల్‌ను దొంగిలించారు. అదే రోజు మరో చోట లారీలో నుంచి 100 లీటర్ల డీజిల్‌ను అపహరించారు. ఘటనపై యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కారుకు ఉన్న నంబరును పరిశీలించగా అది ఒక ఆటోదిగా గుర్తించారు.


