సంగారెడ్డి జోన్: పాలిసెట్ పరీక్షకు సర్వం సిద్ధం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో మూడేళ్ల పాటు పలు రకాల కోర్సులు కొనసాగుతాయి. ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులతో పాటు వ్యవసాయ, వెటర్నరీ కోర్సులలో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించే పరీక్ష కొరకు ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. సంగారెడ్డితో పాటు జోగిపేటలోని పలు కళాశాలలను కేంద్రాలుగా గుర్తించారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. 2,068 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. అయితే.. నిమిషం ఆలస్యం అయినా పరీక్ష కేంద్రాలకు అనుమతి ఇవ్వరు.
పరీక్ష కేంద్రాల వివరాలు
సంగారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (మహిళా), సెయింట్ ఆంథోనీ హైస్కూల్, విద్యానగర్, ప్రభుత్వ జూనియర్ కళాశాల (మహిళ), ఎస్.వి. జూనియర్ కాలేజీ, రాజంపేట రోడ్డు, ప్రభుత్వ హై స్కూల్ ఫర్ బాయ్స్, అప్పర్ బజార్, ఓల్డ్ బస్టాండ్,, జోగిపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, శివంపేట కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక అబ్జర్వర్‌తో పాటు స్పెషల్ అబ్జర్వర్లు ముగ్గురిని నియమించారు.
నేటి ఉదయం 11నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష
జిల్లాలో ఆరు కేంద్రాలు ఏర్పాటు
నిమిషం ఆలస్యమైనా అనుమతిలేదు
హాజరు కానున్న
2068 మంది విద్యార్థులు
నిర్ణీత సమయంలో చేరుకోవాలి
పాలిసెట్ ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులు నిర్ణీత సమయంలో చేరుకోవాలి. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతి ఉండదు. విద్యార్థులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. పరీక్ష నిర్వహణ కొరకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశాం.
– పి.జానకి దేవి,
జిల్లా కోఆర్డినేటర్, సంగారెడ్డి


