ర్యాంకర్లకు సీఎం ప్రశంస | - | Sakshi
Sakshi News home page

ర్యాంకర్లకు సీఎం ప్రశంస

May 13 2026 4:56 AM | Updated on May 13 2026 4:56 AM

మునిపల్లి(అందోల్‌): ఐఐటీజీలో ఉత్తమ ర్యాంకర్లు అయిన అలోక్‌ కుమార్‌జా, ఆదిత్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశంసించినట్లు లింగంపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ సురభి చైతన్య తెలిపారు. వారిద్దరికి ల్యాప్‌టాప్‌లు కూడా అందజేసినట్లు చెప్పారు. ఐఐటీజీ మెన్స్‌లో అలోక్‌ కుమార్‌జా 4వ ర్యాంక్‌ (89.88), పి.ఆదిత్య 10వ ర్యాంక్‌ (85.50) వచ్చినట్లు పేర్కొన్నారు.

తెలుగు సాహితీ మహాసభలను

విజయవంతం చేయండి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి

పటాన్‌చెరు టౌన్‌: రాజమహేంద్రవరంలో జూన్‌ 6, 7 తేదీలలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు సాహితీ మహాసభలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి పిలుపునిచ్చారు. మహాసభలకు సంబంధించిన గోడ పత్రికను కవులతో కలసి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగు భాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. తెలుగు భాషాభివృద్ధి, భాషోద్ధరణకు సాహిత్య సభలు కీలక వేదికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రపంచ తెలుగు సాహితీ మహాసభల జాతీయ సమన్వయకర్తలు, స్థానిక కవులు పాల్గొన్నారు.

పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి

జిల్లా న్యాయసేవాధికార

సంస్థ కార్యదర్శి సౌజన్య

సంగారెడ్డి టౌన్‌: పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని బాలసదన్‌, భరోసా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లల సంరక్షణను తోడ్పడాలన్నారు. బాధితుల సమస్యలను పరిష్కరించాలన్నారు. అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement