జంటగా ప్రత్యక్షం | - | Sakshi
Sakshi News home page

జంటగా ప్రత్యక్షం

May 12 2026 6:18 AM | Updated on May 12 2026 6:18 AM

ప్రేమ వివాహాలతో పెరుగుతున్న మిస్సింగ్‌ కేసులు

పోలీసులకు తలనొప్పిగా మారుతున్న వైనం దాదాపు 90 శాతం కేసులు పరిష్కారం పటాన్‌చెరులో 5 నెలల్లో 77 కేసులు నమోదు

బీడీఎల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 21 కేసులు నమోదు కాగా, 11 కేసులు ట్రేస్‌ చేశారు.

జిన్నారం పీఎస్‌ పరిధిలో నమోదైన కేసుల్లో ఆరుగురిని పోలీసులు గుర్తించారు.

గుమ్మడిదల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఐదు కేసులు నమోదు కాగా, మూడింటిని పరిష్కరించారు.

హత్నూర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎనిమిది కేసులు నమోదు కాగా, ఏడు కేసులను ట్రేస్‌ చేసినట్లు తెలిపారు.

యువతీ, యువకుల అదృశ్యం కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే ఈ కేసుల్లో ఎక్కువ భాగం ప్రేమ వ్యవహారాలకు సంబంధించినవి ఉంటున్నాయి. ఇంటి నుంచి ఒంటరిగా వెళ్లిపోయిన యువతీ, యువకులు కొద్ది రోజుల తర్వాత ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని జంటలుగా పోలీస్‌స్టేషన్లలో ప్రత్యక్షమవుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. – పటాన్‌చెరు టౌన్‌

ఒంటరిగా

అదృశ్యం..

మ పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరుగుతుండగా, మరోవైపు ప్రేమ వివాహం చేసుకున్న జంటలు తమ కుటుంబాల నుంచి ప్రాణహాని ఉందంటూ రక్షణ కోరుతున్నారు. దీంతో ఇప్పటికే వివిధ కేసులతో బిజీగా ఉండే పోలీసులకు మిస్సింగ్‌ కేసులు అదనపు భారంగా మారాయి. ఇలాంటి కేసుల్లో పోలీసులు ముందుగా యువ జంటలను స్టేషన్‌న్‌కు పిలిపించి వారి వివరాలు నమోదు చేస్తున్నారు. అనంతరం ఇరువర్గాల కుటుంబ సభ్యులను రప్పించి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తూ సమస్యను సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

5 నెలలు.. 77 కేసులు

టీవల సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చిన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్‌లో ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు మొత్తం 77 మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో 65 కేసులు పోలీసులు ఛేదించగా, మరో 12 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

వేసవిలోనే ఎక్కువ కేసులు

వేసవి సెలవుల సమయంలోనే ఈ తరహా కేసులు అధికంగా నమోదవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా మార్చి నుంచి జూన్‌ మధ్య యువతీయువకులు ప్రేమ పేరుతో ఇళ్లను విడిచి వెళ్లిపోతున్నట్లు పేర్కొంటున్నారు. చాలామంది కుటుంబ సభ్యులకు తెలియకుండా వెళ్లి వివాహాలు చేసుకుంటున్నారని వెల్లడించారు.

పలు స్టేషన్‌ల వారీగా పరిశీలిస్తే..

Advertisement
 
Advertisement
Advertisement