రామచంద్రాపురం(పటాన్‌చెరు): తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని ఉస్మాన్‌నగర్‌లో రామ్‌రాజ్ షోరూంను మాజీ సర్పంచ్ ఎం.సోమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెల్లాపూర్‌కు సంసంసంప్రదాయ దుస్తులకు నిలయంగా మారిన రామ్‌రాజ్ కాటన్ షోరూం రావడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం రామ్‌రాజ్ కాటన్ వ్యవస్థాపకుడు, చైర్మన్ కే.ఆర్.నాగరాజన్ మాట్లాడుతూ తమ షోరూంను మొదట 1983లో తిరువూరులో ప్రారంభించామన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 370 షోరూంలు ఉన్నాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభిరుచులకు అనుగుణంగా అన్ని రకాల వస్త్రాలు తమ వద్ద లభిస్తాయన్నారు. కొత్తగా తీసుకొచ్చిన ఇన్‌స్టా ధోతిలు అందరినీ ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన షోరూం యాజమానులు భాస్కర్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, ప్రభాకర్, మహేందర్, శ్రీనివాస్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిరెడ్డి, రెడ్డి మల్లారెడ్డి, రెడ్డి రఘుపతి రెడ్డి, బాలాజీ, లచ్చిరాం నాయక్, దేవేందర్ యాదవ్, ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


