భళా.. బాలచిత్రకారులు | - | Sakshi
Sakshi News home page

భళా.. బాలచిత్రకారులు

May 12 2026 6:18 AM | Updated on May 12 2026 6:18 AM

దుబ్బాక: బాల చిత్రకారులకు కేరాఫ్‌ అడ్రస్‌గా దుబ్బాక పట్టణంలోని మల్లిక్‌ ఆర్ట్స్‌ నిలుస్తోంది. పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కాముని మల్లికార్జున్‌ పిల్లల్లో చిత్రలేఖనంపై ఆసక్తి కనబర్చేందుకు నాలుగేళ్లుగా ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నాడు. ప్రతిఏటా వేసవిలో ఉచితంగా క్యాంపులు నిర్వహిస్తూ 50 మందికి పైగా పిల్లలను చిత్రకారులుగా తీర్చిదిద్దుతున్నాడు. రామక్కపేట, దుంపలపల్లి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు డ్రాయింగ్‌లో ప్రత్యేక శిక్షణనిచ్చారు. ఇతని శిక్షణలో రాటుదేలిన ఎంతో మంది చిన్నారులు పలు జాతీయ, రాష్ట్రస్థాయి ఆర్ట్స్‌ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి చాలా అవార్డులు అందుకోవడం విశేషం. ముఖ్యంగా భగత్‌సింగ్‌, గాంధీజీ, స్వామి వివేకానంద, వాజ్‌పేయ్‌, ఇందిరాగాంధీ, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో పాటు ప్రముఖుల చిత్రాలు, దేవతలతో పాటు దేశభక్తి పెంపొందించే చిత్రాలు, పక్షులు, ప్రకృతి ప్రతిబింబించే చిత్రాలను వేయడంపై చిన్నారులకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంటాడు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఆర్ట్స్‌ ఎగ్జిబిషన్స్‌కు తీసుకెళ్తూ అందులో వీరు వేసిన చిత్రాలను సైతం ప్రదర్శింపజేస్తుండటం విశేషం.ఈ వేసవిలో సైతం చిన్నారులకు శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement