నారాయణఖేడ్: స్వీయ జనగణనపై ఖేడ్‌లో ఆదివారం మారథాన్ నిర్వహించారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నగేశ్ షెట్కార్, సబ్ కలెక్టర్ ఉమాహారతి, డీఎస్పీ వెంకట్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి, సీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ శ్రీశైలం, ఎన్యూమరేటర్లు స్థానిక తహసీల్‌గ్రౌండ్ నుంచి రాజీవ్‌చౌక్ వరకు మారథాన్ నిర్వహించి చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో స్వీయ జనగణన చేసుకునే విధానాన్ని వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అనుపమారెడ్డి దంపతులు తమ స్వగృహంలో స్వీయ జనగణనలో భాగంగా తమ వివరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రశాంతి, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభం
ఖేడ్ మండలం పంచగామ, మనూరు మండలం తుమ్నూర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశాలు చేశారు.


