అనుమానాస్పదంగా మహిళ.. | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పదంగా మహిళ..

May 11 2026 9:49 AM | Updated on May 11 2026 9:49 AM

హుస్నాబాద్‌: మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటన హుస్నాబాద్‌లో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని ఎల్లంబజార్‌కు చెందిన దొంతరబోయిన ఎల్లవ్వ (62)కు ముగ్గురు కుమారులున్నారు. రెండేళ్ల క్రితం ఆమె భర్త మృతి చెందాడు. దీంతో ముగ్గురు కుమారుల వద్ద 15 రోజుల చొప్పున ఉంటోంది. శనివారం పెద్ద కుమారుడు వెంకటేశ్‌ ఇంట్లో ఉన్న సమయంలో బాత్రూమ్‌లో కిందపడి మృతి చెందింది. కాగా తల వెనుక భాగంలో, కుడి చెవిపై రక్తం గాయాలు ఉన్నాయి. ఎల్లవ్వ మృతిపై అనుమానం ఉందని ఆమె చిన్న కుమారుడు రాజు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement