గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

May 11 2026 9:49 AM | Updated on May 11 2026 9:49 AM

పటాన్‌చెరు టౌన్‌: రెండు వేర్వేరు కేసుల్లో ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు 6.118 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ వీణారెడ్డి, ఎస్‌ఐ యాదయ్య వివరాల ప్రకారం... ఇస్నాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని రుద్రారం డోయిన్‌ కమిటీ వెంచర్‌లో అక్రమ గంజాయి విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బ్రిజేష్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకొని అతడి వద్ద నుంచి 1.48 కిలోల ఎండు గంజాయిని, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు గోపాల్‌ రెడ్డి పరారీలో ఉన్నాడు. అలాగే కొల్లూరు లేబర్‌ క్యాంప్‌ వద్ద దాడులు నిర్వహించి బీహార్‌కు చెందిన చందన్‌ కుమార్‌ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 4.7 కిలోల ఎండు గంజాయిని, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న 6.188 కిలోల ఎండు గంజాయి రూ.3లక్షల 9 వేలు ఉంటుందన్నారు. పట్టుబడిన నిందితులను ఆదివారం రిమాండ్‌కు తరలించారు. ఈ దాడుల్లో కానిస్టేబుళ్లు మల్లేశం, విక్రమ్‌, ప్రహ్లాద రెడ్డి, ఉమారాణి, ముజామిల్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement