పటాన్‌చెరు టౌన్: పోలీస్ ఉద్యోగం అంటే సమయపాలన ఉండదు. ఎప్పుడైనా డ్యూటీకి వెళ్లాల్సి వస్తుంది. అయినా కుటుంబంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాను. కుటుంబ సహకారం ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరు. ఎస్‌ఐ కావడానికి నా తల్లి సహకారం విజయానికి పునాది. విధులు ముగించుకొని ఇంటికొచ్చాక తల్లి ఇచ్చే ప్రేమ, ఓదార్పు, ఒత్తిడిని దూరం చేస్తాయి. మహిళా ఎస్‌ఐగా గర్వంగా యూనిఫామ్ ధరించి సమాజానికి రక్షణ కల్పిస్తున్నానంటే , దాని వెనుక నా తల్లి, కుటుంబం అందించిన సహకారం, త్యాగం దాగి ఉన్నాయి. అమ్మ సహకారం లేనిదే మహిళా పోలీసులు తమ వ్యక్తిగత, వృత్తి జీవితాల మధ్య సమతుల్యతను సాధించడం చాలా కష్టం.
– ఎస్‌ఐ నాగలక్ష్మి, బీడీఎల్ పోలీస్‌స్టేషన్


