ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించండి | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించండి

May 9 2026 9:43 AM | Updated on May 9 2026 9:43 AM

నారాయణఖేడ్‌: ఖేడ్‌ పట్టణంలో ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చూడాలని ఖేడ్‌ సబ్‌కలెక్టర్‌ ఉమాహారతి మున్సిపల్‌ కమిషనర్‌ ప్రశాంతి, డీఎస్పీ వెంకట్‌రెడ్డిలకు సూచించారు. ఆమె పట్టణంలోని పలు ప్రధాన చౌరస్తాల వద్ద ఆయా అధికారులతో కలిసి శుక్రవారం ట్రాఫిక్‌ సమస్యలను స్వయంగా చూశారు. రోడ్లపై ఆక్రమణలు లేకుండా చూడాలని ఆదేశించారు. వాహనాలు, తోపుడుబళ్లను రోడ్లపై పెట్టకుండా అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్ల విస్తరణ త్వరలో జరగనుండగా దీంతో ట్రాఫిక్‌ సమస్యలకు అడ్డుకట్ట పడుతుందని తెలిపారు. డీఎస్పీ, కమిషనర్‌తోపాటు స్థానిక సీఐ శ్రీనివాస్‌రెడ్డి, జాతీయ రహదారి విభాగం అధికారులు ఆమె వెంట ఉన్నారు.

అర్హులందరికీ

ఇందిరమ్మ ఇళ్లు

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): అర్హులైన వారందరికీ ఇందిరమ్మ పథకంలో ఇళ్లు మంజూరు చేస్తామని జహీరాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ తిరుపతిరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని గుంజోటి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ సిద్దిలింగయ్యస్వామి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చంద్రప్ప, సర్పంచ్‌లు శ్రీనివాస్‌రెడ్డి, అశ్వినీ పాటిల్‌ నాయకులు అడివప్ప పాటిల్‌, సదానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్ల

వేగం పెంచండి

డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌రావు

చిన్నశంకరంపేట(మెదక్‌): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా వేగం పెంచాలని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు. నార్సింగి మండలంలోని నర్సంపల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యంపై ఆరా తీశారు. ఇప్పటివరకు ఎంత కాంటా చేశారని, ఎన్ని లారీలను తరలించారని ఐకేపీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలలోని ధాన్యం వెంట వెంటనే కాంటాచేసి రైస్‌మిల్లులకు తరలించాలని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట ఐకేపీ ఏపీఎం సృజన్‌రెడ్డి, సీసీ శ్రీనివాస్‌గౌడ్‌ ఉన్నారు.

11న పీఎం నేషనల్‌

అప్రంటీస్‌ మేళా

మెదక్‌ కలెక్టరేట్‌: ఈనెల 11న ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్‌ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మెదక్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈ మేళాలో జిల్లాతోపాటు హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల నుంచి పరిశ్రమలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. 18యేళ్లు నిండి ఏదైనా ఐటీఐ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement