కాటేసిన కరెంట్‌ తీగ | - | Sakshi
Sakshi News home page

కాటేసిన కరెంట్‌ తీగ

May 9 2026 9:43 AM | Updated on May 9 2026 9:43 AM

విద్యుదాఘాతంతో రైతు మృతి

చిన్నకోడూరు(సిద్దిపేట): విద్యుత్‌ షాక్‌తో ఓ రైతు మృతి చెందాడు.ఈ సంఘటన మండల పరిధిలోని కస్తూరిపల్లిలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పరుమాల మల్లేశం(56) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఈదురు గాలుల వల్ల విద్యుత్‌ వైర్లు తెగిపడ్డాయి. ఈ క్రమంలో రోజు మాదిరిగా తన పొలం వద్దకు వెళ్లాడు. తెగిపడ్డ విద్యుత్‌ వైర్లను గమనించక పోవడంతో వైర్లు కాలుకు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. భార్య సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చంద్రమోహన్‌ తెలిపారు. విద్యుత్‌ అధికారులు స్పందించి విద్యుత్‌ వైర్లు సరిచేసి ఉంటే ఈ ప్రమాదం జరగకపోయేదని పలువురు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement