సంగారెడ్డి ఎడ్యుకేషన్: తెలంగాణ సాధన సమయంలో అండగా నిలిచిన ప్రజల సమస్యలపై పోరాడాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ జన సమితి ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలే కేంద్రంగా రాజకీయాలు జరగడం లేదని, స్వలాభం, స్వార్థం, డబ్బు చుట్టే రాజకీయాలే జరుగుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం జనగణన చేసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తే.. కేంద్రం 9వ షెడ్యూల్‌లో చేర్చకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు. ట్రిబుల్‌ఆర్, నిమ్స్ వంటి ప్రాజెక్టుల్లో భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు అండగా ఉంటూ న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. రాష్ట్రం కోసం ఎంతో మంది విద్యార్థులు తమ ప్రాణాలను బలిదానం చేస్తే బీఆర్‌ఎస్ వారి కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదన్నారు. గత ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోలేదన్నారు. ధరణి పేరుతో రైతులను ఆగమాగం చేసిందని మండిపడ్డారు.
ఎమ్మెల్సీ కోదండరాం


