నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్–నాందేడ్, అకోలా జాతీయ రహదారి 161పై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా జుక్కల్‌కు చెందిన పొడిచెర నిఖిల్ (23) బైక్‌పై వెళ్తుండగా.. నిజాంపేట్ సమీపంలో వంతెన సైడ్‌వాల్‌ను ఢీకొట్టాడు. సంగారెడ్డి నుంచి జుక్కల్‌కు బుల్లెట్‌పై వెళ్తున్న నిఖిల్ హెల్మెట్ ధరించినా.. పూర్తి స్థాయిలో లేకపోవడంతో సైడ్‌వాల్ తగిలి తీవ్ర గాయాలయఆయయి. వెంటనే ఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి హన్మంతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్‌రెడ్డి వివరించారు.
చెట్టును ఢీకొట్టిన వ్యక్తి..
నర్సాపూర్ రూరల్: బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నర్సాపూర్– సంగారెడ్డి రహదారి పరిధి ఆవంచ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి కథనం ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం తమ్మయపల్లికి శ్రీనివాస్‌రెడ్డి(53) బుధవారం స్కూటీపై జోగిపేట సమీపంలోని సంగయ్యపేటలో జరిగిన బంధువుల పెళ్లికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా నర్సాపూర్– సంగారెడ్డి రహదారిలోని ఆవంచ సమీపంలోకి రాగానే చెట్టును ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
విద్యార్థులపై దాడి
దుర్మార్గమైన చర్య
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సతీష్
సంగారెడ్డి ఎడ్యుకేషన్: విద్యార్థులపై దాడికి పాల్పడిన ఏబీవీపీ నాయకులను తక్షణమే అరెస్ట్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సతీష్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హెచ్‌సీయూలో థియేటర్ విభాగానికి చెందిన విద్యార్థులు మే 3న నాటకం ప్రదర్శన నిర్వహించారన్నారు. అయితే కొంతమంది ఏబీవీపీ నాయకులు అల్లర్లు సృష్టించి, విద్యార్థులను బెదిరించడం, ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. మే 4న విద్యార్థులపై దాడి చేసి కరల్రతో హింసకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ దాడిలో పలువురు విద్యార్థులకు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గాయపడ్డారన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాజేష్, ఉపాధ్యక్షుడు అర్జున్, సహాయ కార్యదర్శి లక్ష్మణ్ పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు
పరిహారం చెల్లించాలి
కంగ్టి(నారాయణఖేడ్): మండలంలోని బోర్గితండాలో బట్టలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ముగ్గురు గిరిజనుల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే పరిహారం చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. బోర్గితండాలో బుధవారం ఆయన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొన్ని రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో వారు బావివద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లాల్సివచ్చిందని ఈ దుర్ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఈ ఘటనలో చనిపోయిన సావిత్రిబాయి, ఆమె కూతరు నిఖిత, మరిది కూతురు నందిని కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. స్థానిక ఎంపీడీఓ, తహసీల్దార్‌తో ఫోన్లో మాట్లాడారు. అనంతరం మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో అబ్రహం, బస్వరాజ్‌పాటిల్, గజానన్, హుల్బారావు పాల్గొన్నారు.


