పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

May 7 2026 9:38 AM | Updated on May 7 2026 9:38 AM

మెదక్‌జోన్‌: మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడికి 20 ఏళ్ల కఠినకారాగార శిక్షతో పాటు, రూ.2 వేల జరిమానా విధించారు. ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ శుభావల్లి బుధవారం తీర్పు చెప్పారని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 2019లో తూప్రాన్‌ మండలంలో మతిస్థిమితం లేని బాలికపై అర్కెల నాగేశ్‌ అత్యాచారం చేశాడని తెలిపారు. దీంతో ఆమె గర్భందాల్చిందని, తాను తల్లికాబోతున్న విషయం సైతం ఆ బాలికకు తెలియదన్నారు. ఈ విషయంపై అప్పట్లో పోలీసులు పోక్సో కింద కేసునమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారన్నారు. ఐదేళ్ల తరువాత ఈ కేసులో నిందితుడికి న్యాయమూర్తి శిక్ష విధించారని చెప్పారు. కాగా బాధితురాలికి పునరావాసం కింద రూ.2 లక్షల ఆర్థికసహాయం చేయాలని న్యాయమూర్తి ప్రభుత్వాధికారులను ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.

కత్తితో దాడి కేసులో

మూడేళ్లు..

కంగ్టి(నారాయణఖేడ్‌): మండల పరిధి తడ్కల్‌ గ్రామానికి చెందిన కటికె యాదుల్‌కు మూడేళ్ల జైలుశిక్షతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ బుధవారం జిల్లా ఆదనపు సెషన్స్‌ కోర్టు జడ్జి జయంతి తీర్పునిచ్చినట్లు కంగ్టి సీఐ వెంకట్‌రెడ్డి చెప్పారు. గ్రామానికి చెందిన యాదుల్‌కు 2021లో మటన్‌ దుకాణం వద్ద తండ్రి జాఫర్‌, అన్న యూసుఫ్‌లతో గొడవపడ్డాడు. యాదుల్‌ ఆవేశంలో జాఫర్‌, యూసుఫ్‌లపై కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అప్పుడు యాదుల్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేయగా సబ్‌కోర్టు సంవత్సరం పాటు జైలు శిక్ష విధించింది. నిందితుడు అప్పీల్‌కు వెళ్లగా మూడేళ్లు జైలుశిక్ష విధించినట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement