7న టీజేఎస్‌ ప్లీనరీ | - | Sakshi
Sakshi News home page

7న టీజేఎస్‌ ప్లీనరీ

May 6 2026 9:07 AM | Updated on May 6 2026 9:07 AM

సంగారెడ్డి ఎడ్యుకేషన్‌: సంగారెడ్డిలో ఈ నెల 7న తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) ప్లీనరీని నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు తుల్జారెడ్డి తెలిపారు. సంగారెడ్డిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...ప్లీనరీకి పార్టీ అధినేత కోదండరాంతోపాటు మరికొంతమంది ముఖ్య నేతలు హాజరవుతారన్నారు. ప్లీనరీలో పార్టీ బలోపేతం, విధి విధానాలు, అనుసరించాల్సిన వ్యూహాలను చర్చించనున్నట్లు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మి, పాండు, విజయ్‌, మధుకర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement