పటాన్‌చెరుటౌన్: అంగారక చతుర్థి పురస్కరించుకుని ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం సమీపంలో గణేశ్‌గడ్డ దేవస్థానంలో మంగళవారం అంగారక చతుర్థి పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడింది. భారీ సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు సందడిగా నెలకొంది. ఉదయం నుంచి గణనాథుడికి తేనెతో ప్రత్యేకాభిషేకం, హోమం, గరికపూజ చేసినట్లు ఆలయ అర్చకులు సంతోష్ జోషి, జగదీశ్వర్‌స్వామి, చంద్రశేఖర్, సతీష్, అయ్యప్పలు తెలిపారు. భక్తులకు ఆలయంలో నిత్యాన్నదానం కొనసాగుతున్నదని ఆలయ ఈవో లావణ్య,జూనియర్ అసిస్టెంట్లు ఈశ్వర్ తెలిపారు.
మొక్కజొన్న కేంద్రాన్ని
సందర్శించిన ఆర్డీఓ
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలోని డీసీఎంఎస్ కేంద్రంలో ఏర్పాటు చేసిన మొక్క జొన్న సెంటర్‌ను ఆర్డీఓ దేవూజీ, వ్యవసాయ శాఖ ఏడీఏ భిక్షపతి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు కేంద్రంలో జరు గుతున్న కొనుగోళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 2,788 క్వింటాళ్ల మొక్కలను కొనుగోలు చేశామని, క్వింటాల్‌కు రూ.2,400 మద్దతు ధర కల్పిస్తున్నట్లు సెంటర్ నిర్వాహకులు అధికారులకు తెలిపారు. ప్రస్తుతం 320 క్వింటాళ్ల మక్కలు నిలువ ఉన్నా యని చెప్పారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
రాష్ట్రంలో బీజేపీ జెండా
ఎగురవేస్తాం
బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి
పటాన్‌చెరు టౌన్: రాష్ట్రంలో 2028లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేస్తా మని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగురవేసిన నేపథ్యంలో మంగళవారం పటాన్‌చెరు డివిజన్‌లో బీజేపీ శ్రేణులతో కలసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, పటాన్‌చెరు కన్వీనర్ శ్రీనివాస్‌గుప్తా, మాణిక్‌రావు పాల్గొన్నారు.
17న గీతం అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష
పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం స్కూల్ ఆఫ్ సైన్స్ యూజీ, పీజీ కోర్సులలో ప్రవేశాల కోసం ఈనెల 17న గీతం అడ్మిషన్ టెస్ట్ (గాట్–2026, మూడో దశ)ను నిర్వహించనుంది. ఆసక్తి గల అభ్యర్థులు మే 14 వ తేదీలోగా విశ్వవిద్యాలయ అధికారిక పోర్టల్ ద్వారా తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. దరఖాస్తులు, ఇతర వివరాల కోసం హెల్ప్ లైన్ 888498 4000ను సంప్రదించాలని సూచించారు.
నర్సాపూర్: ఉద్యాన పంటలు సాగు చేసి రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని అదనపు కలెక్టర్ నగేశ్ సూచించారు. రైతు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం పట్టణంలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెంపుదల– ప్రత్యామ్నాయ పంటల సాగు అంశంపై నిర్వహించిన అవగాహన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


