కలెక్టర్ ప్రతీక్ జైన్
పుల్‌కల్(అందోల్): ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైతులకు గోనె సంచులను సకాలంలో అందించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పష్టం చేశారు. పుల్‌కల్ మండలంలోని గొంగ్లూర్‌ఽ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్రానికి ధాన్యాన్ని తెచ్చే రైతులకు జాబితా ప్రకారం వరుసగా కాంటా వేయాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ కృష్ణ ఉన్నారు.
ధాన్యం కొనుగోలు వేగిరం చేయాలి
జాయింట్ కలెక్టర్ మాధురి
హత్నూర (సంగారెడ్డి): రైతులకు ఇబ్బందుల్లేకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మాధురి పేర్కొన్నారు. హత్నూర, దేవులపల్లి, దౌల్తాబాద్, చందాపూర్, గ్రామాల్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను జాయింట్ కలెక్టర్ మాధురి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..రైతులు తెచ్చిన ధాన్యం వెంటనే తేమ శాతం పరిశీలించి ధాన్యాన్ని తూకం వేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే లారీల్లో రైస్ మిల్లులకు పంపించాలని సూచించారు. లారీల ఇబ్బంది ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ పర్వీన్ షేక్, ఏపీఎం రాజశేఖర్, పలు గ్రామాల సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.


