పంచాయతీరాజ్‌లో కూడా.. | - | Sakshi
Sakshi News home page

పంచాయతీరాజ్‌లో కూడా..

May 6 2026 9:07 AM | Updated on May 6 2026 9:07 AM

● నాలుగేళ్లు పూర్తయిన వారికి తప్పనిసరి ● నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం జిల్లాలో 3 డివిజన్లు, 25 మండలాల పరిధిలో 613 గ్రామపంచాయతీలున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాలయంలో ఏఓ, ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లు, డీఎల్‌పీఓ ముగ్గురు, ఎంపీఓలు 24,580 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో సుమారు 200 వరకు ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశం ఉంది.

● నాలుగేళ్లు పూర్తయిన వారికి తప్పనిసరి ● నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం

సంగారెడ్డి జోన్‌: కొన్నేళ్లుగా పంచాయతీరాజ్‌ శాఖలో ఒకేచోట విధులు నిర్వహిస్తోన్న అధికారులకు స్థానచలనం కలగనుంది. బదిలీ ప్రక్రియ చేపట్టేందుకు అధికార యంత్రాంగం రంగం సిద్ధమవుతోంది. జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు డీఎల్పీఓ, ఎంపీఓ, పంచాయతీ కార్య దర్శులు బదిలీ కానున్నారు. ఇప్పటికే వివిధ స్థాయి ల్లో విధులు నిర్వహిస్తున్న అధికారుల జాబితాను రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖకు నివేదికలు పంపారు.

నాలుగేళ్లు దాటితే..

ఈ ఏడాది జనవరి 1 నాటికి ఒకేచోట మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు బదిలీకి అర్హులు. 2027 మే 31 నాటికి పదవీవిరమణ చేసే ఉద్యోగులు వారు కోరుకుంటే తప్ప బదిలీ లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలో విధులకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు 40% బదిలీ చేపట్టనున్నారు.

25 మండలాలు.. 613 జీపీలు

Advertisement
 
Advertisement
Advertisement