పటాన్‌చెరు టౌన్: పాఠశాలల్లో నూతన మార్పులు తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని, విద్యా నాణ్యతను పెంపొందించేందుకు సమష్టిగా కృషి చేయాలని ఉపాధ్యాయురాలు రమణీ పేర్కొన్నారు. పటాన్‌చెరు మండల పరిధిలోని నందిగామ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాభివృద్ధిపై కీలక సమావేశం జరిగింది. ఇటీవల ఫిన్‌లాండ్‌లో నిర్వహించిన ఎక్స్‌పోజర్ విజిట్‌కు వెళ్లి వచ్చిన రమణీ అనుభవాలను పాఠశాలల్లో అమలు చేయడమే లక్ష్యంగా మంగళవారం పాఠశాల ఆవరణలో మండల విద్యాధికారి నాగేశ్వరరావు నాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయురాలు రమణి ఫిన్‌లాండ్ దేశంలో అమలు చేస్తున్న విద్యా విధానాలు, విద్యార్థి కేంద్రిత బోధన, పాఠశాల వాతావరణం వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


