అంతర్జాతీయ పోటీలకు విద్యార్థులు
టేక్మాల్(మెదక్): రంగోత్సవ్ ముంబై ఆధ్వర్యంలో అక్టోబర్‌లో నిర్వహించిన కళాపోటీల్లో టేక్మాల్ ఆదర్శ పాఠశాల, కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు ప్రిన్సిపాల్ సాయిలు, ఆర్ట్ కో–ఆర్డినేటర్ జలీల్ తెలిపారు. 55 మంది జాతీయ స్థాయి పోటీల్లో బహుమతులు సాధించి అంతర్జాతీయ కళాపోటీలకు ఎంపికయ్యారు. 27 మంది బంగారు, 15 మంది కాంస్యం, 10 మంది రజత పతకాలు సాధించారు. కాగా ఈ పోటీల్లో శిరీష ద్వితీయ, అనన్య ఫైవ్‌స్టార్ బ్రిలియంట్ బహుమతులు పొందారు. వివిధ అంశాలైన గ్రీటింగ్ కార్డ్ , టాటూ, కార్టూన్ మేకింగ్, హ్యాండ్ రైటింగ్, స్కెచింగ్, పలు అంశాల్లో పాల్గొని ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం బహుమతులు అందించారు. ఉపాధ్యాయుడు జలీల్‌ను అభినందించారు.


